విద్యుత్​ స్టోర్ ​మెటీరియల్​ను ఆన్​లైన్​ చేయాలి: ఎలక్ట్రికల్​ కాంట్రాక్ట్ అసోసియేషన్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: డిస్కంలు విద్యుత్​ స్టోర్​ మెటీరియల్ ను ఆన్​లైన్​ చేసి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రికల్​ కాంట్రాక్ట్ అసోసియేషన్ డిమాండ్​చేసింది. శనివారం హైదరాబాద్​లో అసోసియేషన్​ అధ్యక్షుడు బీసీ రెడ్డి అధ్యక్షతన కాంట్రాక్ట్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. స్టోర్​లలో మెటీరియల్​ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

అందరూ వెండర్ కోడ్​ తీసుకోవాలని ఇటీవల సదరన్​ డిస్కం సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారని, ఇది తమకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు.  ప్రైవేటు, గవర్నమెంట్ సెక్టార్​లలో ఏ రంగంలో పనిచేసినా ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు ద్వారా లైసెన్స్ పొందాలని సూచించారు. గత మూడు నెలలుగా ఎల్సీలు ఇవ్వక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రోజు ఎల్సీలు ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధులు సీఎండీని కోరారు.

ప్రైవేట్ సెక్టార్ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు స్పెషలైజేషన్ ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బీసీరెడ్డితో పాటు అసోషియేషన్​ ప్రతినిధులు, లైసెన్సింగ్​బోర్డు మెంబర్​నేమాల బెనర్జీ, మాజీ అధ్యక్షుడు నక్క యాదిగిరి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆలూరు మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నామిని వెంకటేశ్ నేత,  జీడిమెట్ల డివిజన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ జనరల్ సెక్రెటరీ అశోక్. రాష్ట్ర కమిటీ అడ్వైజర్, వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.