ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలి : ఎస్పీ రామేశ్వర్

కల్వకుర్తి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో  అవాంఛనీయమైన  ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ తెలిపారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ నగర్, గచ్చిబావి, హనుమాన్ నగర్ కాలనీలలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసమే పోలీసు వ్యవస్థ ఉందని,   క్రైమ్ జరగకుండా ముందస్తుగా కార్డెన్ సర్చ్  నిర్వహిస్తున్నామన్నారు.   కార్డెన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 34 బైకులు, ఒక కారు, అక్రమంగా నిల్వ ఉంచిన 34 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.   కల్వకుర్తి  డీఎస్పీ  వెంకటేశ్వర్లు,  సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్ రెడ్డి , ఎస్​ఐలు మాధవరెడ్డి, రవి, వీరబాబు, మహేందర్, రాజశేఖర్ లతోపాటు 86 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.