ఈసీ సంచలన నిర్ణయం, ముగ్గురు కలెక్టర్లు,ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీపై బదిలీ వేటు...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈసీ దూకుడు పెంచింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదుగురు ఎస్పీలు ఒక ఐజీపై బదిలీ వేటు వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోడీ సభకు సరిగా బందోబస్తు ఏర్పాటు చేయలేదని పల్నాడు, ప్రకాశం ఎస్పీలపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈసీ నిర్ణయంతో బదిలీ వేటు పడిన ఐపీఎస్ లలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూర్ ఎస్పీ జాషువా,ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్,అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్,గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు లు ఉన్నారు. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విపక్షాల ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వీరితో పాటుగా కృష్ణా కలెక్టర్ రాజబాబు, అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మిషా లపై కూడా బదిలీ వేటు వేసింది ఈసీ. 

ALSO READ :- సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో రఘునందన్ రావుపై కేసు నమోదు