నారా భువనేశ్వరికి ఈసీ షాక్ - నోటీసులు జారీ...


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. నిజం గెలవాలి సభలో ఓటర్లకు  డబ్బులు పంచుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో నియమాలను ఉల్లంఘిస్తూ నిజం గెలవాలి సభలో చెక్కులు పంపిణీ చేయటంపై ఫిర్యాదు చేశారు అప్పిరెడ్డి.ఈ మేరకు నోటీసులు జారీ చేసిన ఈసీ దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల లోగా నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో జైలుకు వెళ్లిన సమయంలో మనస్తాపానికి చెంది ప్రాణాలు విడిచిన వారిని పరామర్శించడం కోసం నిజం గెలవాలి సభలు ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో భాగంగా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ నియమాల ఉల్లంఘన కిందకి వస్తుందని ఆధారాలతో సహా అధికార పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నారా భువనేశ్వరికి నోటీసులు జారీ చేసింది.