సీఎం జగన్ కు ఈసీ షాక్.. నోటీసులు జారీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారం కూడా మొదలు పెట్టడంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తోంది.ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు ఈసీ షాక్ ఇచ్చింది.

ఇటీవల పూతలపట్టులో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు మేరకు ఈనికల సంఘం సీఎం జగన్ కు నోటీసులు పంపింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పూతలపట్టు సభలో చంద్రబాబును అరుంధతి సినిమాలో విలన్ పశుపతితో పోలుస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలపై వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.