చంద్రబాబుకు ఈసీ షాక్.. నోటీసులు జారీ

2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల నాయకులంతా ప్రచారం ముమ్మరం చేసి జనంలో తిరుగుతుండటంతో నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది.ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎమ్మిగనూరు, మార్కాపురం బాపట్ల సభల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఈసీ బాబుకు నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన ఈసీ 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరి, ఈసీ నోటీసుల పట్ల చంద్రబాబు ఏ రకంగా స్పందిస్తారు, ఎలాంటి వివరణ ఇస్తారు అన్నది వేచి చ్చుడాలి. 

ALSO READ :- ఆటో ఇండస్ట్రీలో ఫస్ట్ టైం : జపాన్, కొరియా SUV కార్లను వెనక్కి నెట్టిన టాటా నెక్సన్