ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమవుతోంది. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఆరా తీస్తోంది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీల నుండి వివరణ కోరారు. ఈసీ ఆదేశాల మేరకు మూడు జిల్లాల ఎస్పీలు ముఖేష్ కుమార్ ను కలిసి వివరణ ఇవ్వనున్నారు ఎస్పీలు రఘవీర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి.
మాచర్లలో టీడీపీ నేత కారు తగలబెట్టిన ఘటన, చాగలమర్రి, గిద్దలూరు ప్రాంతాల్లో జరిగిన హత్యల గురించి ఎస్పీల నుండి ఈసీ వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలు కావటంతో ఈసీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలపై సంజాయిషీ తెలపాలని ఎస్పీలను ఆదేశించింది ఈసీ. ఘటనకు గల కారణాలు, హింసాకాండకు దారి తీసిన పరిణామాలు, వాటి నివారణకు తీసుకున్న చర్యల గురించి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించి. ఎస్పీలు ఇచ్చిన వివరణను ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా.
Also read : మార్చి 24, 25న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి