ఏపీలో ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు...

ఏపీలో ముగ్గురు కలెక్టర్లు, ఐదుగురు ఎస్పీలపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విపక్షాల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా బదిలీ అయినవారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ. ఈ సాయంత్రంలోగా విధుల్లో హాజరు కావాలని ఆదేశించింది. కృష్ణా జిల్లా కలెక్టర్ గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్ గా వి.వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ లను నియమించింది. 

కొత్త ఎస్పీల జాబితాలో చిత్తూరు ఎస్పీగా మణికంఠ, గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాటి, ప్రకాశం ఎస్పీగా సునీల్, పల్నాడు ఎస్పీగా బింధు మాధవ్, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్ధార్,నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్ లను నియమించింది ఈసీ. కొత్తగా నియమించబడ్డ కలెక్టర్లు, ఎస్పీలు ఏప్రిల్ 4వ తేదీ ( గురువారం ) సాయంత్రం 8గంటల లోగా విధులకు హాజరు కావాలని ఆదేశించింది ఈసీ. 

ALSO READ :- War 2: నాటు నాటు రేంజ్ ఉంటుందా?.. దుమ్ములేపనున్న హ్రితిక్, ఎన్టీఆర్