బ్యూటీ శ్రీలీల మెస్మరైజింగ్ ‘కిస్సిక్’ సాంగ్ ఇపుడు.. బామ్మల మాసివ్ సాంగ్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కిస్సిక్ పాటకు సరదాగా తమదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు ఈ బామ్మలందరు.
కర్ణాటక బెల్గం ఊరిలో శాంతాయ్ వృద్ధాశ్రమం ఉంది. ఆ ఓల్డ్‌ఏజ్ హోంలో ఉన్న ఓ నలుగురు బామ్మలు చేసిన కిస్సిక్ డాన్స్ ఇపుడు తెగ ట్రెండ్ అవుతోంది. కేవలం 17 సెకన్ల మేరకు ఉన్నఈ వీడియోలో నలుగురు బామ్మలు చేసిన స్టెప్స్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దాంతో బామ్మల కిస్సిక్ డాన్స్ అదిరిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే 'సారీ శ్రీలీల.. ఫీలవ్వొద్దు.. ఏమాటకామాట.. బామ్మల కిసిక్కు డ్యాన్స్ వేరె లెవెల్' అంటూ కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ 17 సెకన్ల వీడియోని లక్షల మంది చూస్తూ ఆనందిస్తున్నారు. ఇపుడీ ఈ పాట పిల్లల నుంచి ముసలోళ్ల వరకు ఎవరూ తగ్గట్లేదనేలా అనుకరిస్తున్నారు. అయితే ఈ వీడియోని పుష్ప 2 మేకర్స్ కూడా షేర్ చేయడంతో మరింత వైరల్ అవుతోంది. దాంతో ఈ బామ్మలందరు గతంలో పలు పాటలకు చేసిన డ్యాన్స్ వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆలస్యం ఎందుకు మీరు కూడా బామ్మల డ్యాన్స్ వీడియో చూసేయండి. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ మాసివ్ లిరిక్స్ రాశారు. సుబ్‌లాషిని పాడిన తీరు, గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఇంప్రెస్ చేస్తున్నాయి.
ఇకపోతే.. ఈ సాంగ్ ముఖ్యంగా వైరల్ అవ్వడానికి శ్రీలల డ్యాన్స్ మాత్రమే కాదు. చంద్రబోస్ అందించిన లిరిక్స్ అందరి దృష్టిని ఆకర్శించాయి. అందులో కొన్ని లైన్స్ చూస్తే మీకే అర్ధమవుతుంది.
‘దించర దించర దించు.. మావయ్య వచ్చాడు దించు.. కిస్ కిస్ కిస్సిక్.. దించర దించర దించు.. బావయ్య వచ్చాడు దించు.. కిస్ కిస్ కిస్సిక్.. చిచ్చా వచ్చాడు దించు.. మచ్చా వచ్చాడు దించు.. మావోడు వచ్చాడు మీవోడు వచ్చాడు మనవోడు వచ్చాడు దించు.. వాళ్లతో ఫొటో వీళ్లతో ఫొటో ఆల్బమ్‌లో అంటించు.. మరి నాతో దిగిన బొమ్మను బాబు లాకర్‌లో దాచుంచు.. పుసుక్కున ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా.. దెబ్బలు పడతాయిరో..’ అంటూ పార్టీ మూడ్‌లో సాగిన పాట సినిమాపై ఆసక్తిని పెంచిందనే చెప్పాలి.