బర్త్ డే పార్టీకి పిలిచి.. మద్యం తాగించి ఆభరణాలు చోరీ

మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం జగ్గంగూడలో  దారుణం చోటుచేసుకుంది. ఇంటి పక్కనే అద్దెకు  ఉంటున్న ఇద్దరు భార్యాభర్తలు బర్త్  డే పార్టీ ఉందని వృద్ధురాలిని ఇంటికి పిలిచి మద్యం తాగించి కట్టేసి..  నోట్లో గుడ్డలు కుక్కి మెడలో ఉన్న 7 తులాల బంగారు గొలుసు.. 30 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.  

చుట్టుపక్కల వారు గమనించగా వృద్ధురాలికి స్వల్ప గాయాలు కావడంతో  స్థానిక  ఆసుపత్రికి తరలించారు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  దుండగుల కోసం  సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు.