80 కోట్ల కరెంట్ బిల్లు.. షాకై ఆస్పత్రిపాలైన యజమాని

80 కోట్ల కరెంట్ బిల్లు.. షాకై ఆస్పత్రిపాలైన యజమాని

మహారాష్ట్రలో ఓ యజమాని కరెంట్ బిల్లు చూసి షాక్ కు గురై  ఆస్పత్రి పాలయ్యాడు. ఆయనకు వచ్చిన బిల్లు చూస్తే ఎవరికైనా కల్లు బైర్లు కమ్ముతాయి. ఇంతకీ ఆయనకు ఎంత కరెంట్ బిల్లు వచ్చిందో తెలుసా? అక్షరాల రూ.80 కోట్లు అవును. మహారాష్ట్రలోని నలసోపారా పట్టణంలోని నిర్మల్ గ్రామంలో రైస్ మిల్లు నడుపుతున్న గణపత్ నాయక్ (వయసు80) కు రూ. 80 కోట్ల  విద్యుత్ బిల్లు రావడంతో బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరాడు

అయితే  బిల్లులో టైపింగ్ లోపం వల్ల జరిగిందని తరువాత తెలిసింది. మీటర్ రీడింగ్ తీసుకునే ఏజెన్సీలో లోపం ఉందని మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్‌ఇడిసిఎల్) స్పష్టం చేసింది. బిల్లును సరిచేసినట్లు ఎంఎస్‌ఇడిసిఎల్ తెలిపింది. టైప్ చేసేటప్పుడు  ఆరు అంకెలకు బదులు తొమ్మిది అంకెల బిల్లును ఇచ్చారని.. మళ్లీ విద్యుత్ మీటర్ రీడింగ్ ను చెక్ చేసి బిల్లు సరి చేస్తే రూ. 80 వేలుగా ఉందని  విద్యుత్ బోర్డు అధికారి సురేంద్ర మోనెరే అన్నారు.

విద్యుత్ బిల్లు వచ్చినప్పుడు అక్కడున్న వారు మొత్తం షాకయ్యారన్నాడు గణపతినాయక్ మనవడు నీరాజ్. అది మొత్తం జిల్లా బిల్లు అనుకున్నామని  తర్వాత చెక్ చేస్తే తమ  బిల్లు అని తేలిందన్నారు. లాక్డౌన్ కాలానికి విద్యుత్ బోర్డు ప్రతి ఒక్కరి నుండి బకాయిలు వసూలు చేస్తుందేమోనని..అందుకే ఇంత ఎక్కువగా బిల్లు వచ్చిందనుకుని తాము భయపడ్డామన్నారు.