గుడ్డు గొంతులో ఇరుక్కొని వృద్ధుడు మృతి

లింగాల, వెలుగు : కోడిగుడ్డు గొంతులో ఇరుక్కొని ఓ వృద్ధుడు చనిపోయాడు. నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా బిజినేపల్లి మండలం నంది వడ్డెమాన్‌‌ గ్రామానికి చెందిన తిరుపతయ్య (60) ఆదివారం లింగాలలో  బంధువుల ఇంటికి వెళ్లాడు.  

తిరిగి అప్పాయపల్లి వెళ్లేందుకు కమాన్‌‌ వద్దకు వచ్చాడు. అక్కడ ఉడకబెట్టిన కోడిగుడ్లను కొనుక్కొని తింటుండగా గుడ్డు గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో శ్వాస ఆడక అక్కడికక్కడే చనిపోయాడు.  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని మృతుడి వివరాలు సేకరించారు.