తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు మధ్య ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఇక్కడి ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ దగ్గర బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు మారేడుమిల్లి నుంచి బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

