పేద విద్యార్థులకు అండగా ఉంటాం : ఈగ వెంకటేశ్వర్లు

  • పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు

మహబూబ్​నగర్​ టౌన్, వెలుగు: నిరుపేద పద్మశాలి స్టూడెంట్ల చదువు కోసం ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు తెలిపారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని శివ మార్కండేయ ఆలయంలో ఆదివారం ఉదయం సంఘం ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు.

టెన్త్, ఇంటర్, డిగ్రీ, నీట్ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఆర్థికసాయంతో పాటు సర్టిఫికెట్, మెమెంటోను అందజేశారు. ఉత్తమ ఉద్యోగులుగా అవార్డు పొందిన వారికి, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, రిటైర్డ్​ ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా మెరుగు శ్రీనివాసులు, యాద గిరేందర్, సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కడవేరు లక్ష్మీపతి, జిల్లా ఇన్​చార్జి దేవులపల్లి రాజేశ్వర్, ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు కెంచె సుభాష్ చంద్ర, కార్యదర్శి బాలకృష్ణ పాల్గొన్నారు.