భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం

 పాపన్నపేట, వెలుగు : మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ పరిసరాలు దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. మంజీర నదిపాయల్లో పుణ్యస్నానాలు చేసిన భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. కోరిన కోరికలు తీర్చిన అమ్మవారికి ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుపాయలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు