జలదిగ్బంధంలోనే దుర్గమ్మ ఆలయం

ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం రెండు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. భారీ వర్షాలకు వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఆనకట్ట పై నుంచి గంగమ్మ ఎగిసిపడుతూ దుర్గమ్మ ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో ఆలయాన్ని అధికారులు మూసివేసి రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ‌‌‌‌‌‌‌‌ - పాపన్నపేట, వెలుగు