- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకట్ నరసింహారెడ్డి
జగదేవపూర్, వెలుగు: జగదేవపూర్ కేజీబీవీ స్కూల్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని పాఠశాల విద్యా డైరెక్టర్ వెంకట్ నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్‌ను డీఈవో శ్రీనివాస్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల భవన సముదాయాన్ని పరిశీలించి స్టూడెంట్స్‌తో మాట్లాడారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్టూడెంట్స్ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సెలవు దినం కావడంతో పిల్లలను కలవడానికి వచ్చిన తల్లిదండ్రులుతో కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ డైరెక్టర్ మాట్లాడుతూ.. ప్రహరీ నిర్మాణానికి కావలసిన ఎస్టిమేషన్ వేయించి వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. స్కూల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. బియ్యం ఎక్కువగా నిల్వ ఉంచొద్దని ఎస్వో కు సూచించారు. స్కూల్ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, ప్రొజెక్టర్ కు కనెక్షన్ ఇచ్చి పాటలు బోధించేలా చర్యలు చేపట్టాలని డీఈవో కు సూచించారు. వెంటనే పనులు ప్రారంభించాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ని ఆదేశించారు.