హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అలాగే ఏపీలోని 56 ఎకరాల హాయ్‌లాండ్ ఆస్తులు అటాచ్ చేసింది. అంతేకాకుండా పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలను కూడా ఈడీ అటాచ్ చేసింది. అగ్రిగోల్డ్‌పై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది ఈడీ.
