ఐఏఎస్‌‌ అమోయ్‌‌కుమార్‌‌‌‌కు ఈడీ సమన్లు

  • ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఆదేశం
  • రంగారెడ్డి జిల్లా భూ కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ

హైదరాబాద్‌‌, వెలుగు : రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌‌,‌‌ ఐఏఎస్‌‌ అధికారి అమోయ్‌‌కుమార్‌‌‌‌ చుట్టూ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) ఉచ్చు బిగుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో  రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌‌గా ఉన్న సమయంలో భూకేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డట్టు అమోయ్‌‌కుమార్‌‌‌‌పై ఆరోపణలు ఉన్నాయి.

ఈ మేరకు ఈ నెల 22న విచారణకు రావాలని అమోయ్​కుమార్​కు ఈడీ శనివారం సమన్లు జారీ చేసింది. ఆ రోజు తనకు వీలుకాదని ఆయన తెలిపినట్టు సమాచారం. అయితే, 23న విచారణకు హాజరుకావాలని అమోయ్​కుమార్​కు ఈడీ అధికారులు సూచించారు.