ఉద్యోగ కుంభకోణంలో లాలూ ప్రసాద్, తేజస్వీయాదవ్కు ఈడీ సమన్లు

ఉద్యోగ కుంభకోణంలో లాలూ ప్రసాద్, తేజస్వీయాదవ్కు ఈడీ సమన్లు

ఉద్యోగ కుంభకోణం కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో పాటు ఆయన తండ్రి రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లను విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.  శుక్రవారం( డిసెంబర్22) తేజస్వీ యాదవ్, డిసెంబర్ 27న లాలూ ప్రసాద్ యాదవ్ ను విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. 

నవంబర్ 11న ఈ కేసుకు సంబంధించి అమిత్ కత్వాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. నెలరోజుల తర్వాత ఆర్జేడీ నేతలకు తాజాగా సమన్లు జారీ చేసింది ఈడీ. కత్వాల్ ప్రశ్నించగా ఈ కేసులో ఆర్జేడీ నేతల ప్రమేయం పై కీలక విషయాలు ఈడీ వెల్లడించినట్లు ఈడీ తెలిపింది. 

2004-2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా గ్రూప్ డి ఉద్యోగాల నియామకంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు పొందాలనుకునే పేద అభ్యర్థులు భూమిని లంచంగా బదిలీ చేయాలని చెప్పినట్లు ఎఫ్ఐఆర్ లో సీబీఐ పేర్కొంది. ఈ కేసులో సీబీఐ ఛార్జీ షీటు కూడా దాఖలు చేసింది.