మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు నోటీసులు పంపింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ ముఖ్ ను ప్రశ్నించనుంది ఈడీ. ఇక ఇప్పటికే ఈ కేసులో అనిల్ దేశ్ ముఖ్ అనుచరులు కుందన్ షిండే, సంజీవ్ పలాందేలను అరెస్టు చేసింది ఈడీ. వీరిద్దరిని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించాక అరెస్టు చేసినట్లు ప్రకటించింది. మంత్రిగా ఉన్న టైంలో దేశ్ ముఖ్ కు 4 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కొందరు బార్ యజమానులు అంగీకరించినట్లు తెలుస్తోంది.
