ఫార్ములా ఈ రేస్ వ్యవహారం: కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు

ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ఎంట్రీ అయింది. కేటీఆర్, అర్వింద్ కుమార్,బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు పెట్టింది. డిసెంబర్ 20న  ఉదయం ఫార్ములా-E కేసుకు సంబంధించి డిటైల్స్ ఇవ్వాలని  ఏసీబీకి ఈడీ లేఖరాసింది. ACB నుంచి FIR కాపీ అందటంతో ECIR నమోదు చేసింది ఈడీ. ఫార్ములా-E రేస్ కేస్ లో A1, A2, A3లపై కేసులు పెట్టింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది.

విచారణకు ఒకే చెప్పిన హైకోర్టు

KTR పై ఫార్ములా ఈ రేస్ కేసులో ACB విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.   కేటీఆర్ ను 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని.. అయితే ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని  చెప్పింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్  క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టులో  పిటిషన్ వేశారు.   విచారణ సందర్బంగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్ ను డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.కేసు కొట్టేయాలన్న కేటీఆర్ వాదనను  తిరస్కరించింది. కేసులో విచారణకు ఎవరినైనా పిలవొచ్చని తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కు  వాయిదా వేసింది కోర్టు.

రూ.55 కోట్లు అక్రమంగా విదేశాలకు

ఫార్ములా ఈ– కార్​ రేస్ వ్యవహారంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్​ ప్రెసిడెంట్‌‌  కేటీఆర్‌‌‌‌పై ఏసీబీ కేసు​ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎంఏయూడీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ దాన కిశోర్‌‌ ఫిర్యాదు మేరకు.. 13(1)(ఏ) రెడ్‌‌విత్‌‌, 13(2) ప్రివెన్షన్‌‌ ఆఫ్ కరప్షన్‌‌ యాక్ట్‌‌, 409 రెడ్‌‌విత్‌‌, 120(బి) ఐపీసీ సెక్షన్స్‌‌ కింద గురువారం ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌ చేసింది. రూ. 55 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడి(ఏ1)గా కేటీఆర్​ను చేర్చింది. రెండో నిందితుడి(ఏ2)గా సీనియర్ ఐఏఎస్‌‌ ఆఫీసర్​ అర్వింద్​కుమార్‌‌‌‌, మూడో నిందితుడి(ఏ3)గా హెచ్‌‌ఎండీఏ మాజీ చీఫ్‌‌ ఇంజనీర్‌‌‌‌ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని పేర్కొంది