రౌడీ షీటర్ మహ్మద్ కైసర్‌పై ED దర్యాప్తు.. రూ.కోటి విలువైన ఆస్తులు అటాచ్

హైదరాబాద్ హబీబ్ నగర్ కు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ కైసర్‌పై ED అధికారులు దర్యాప్తు చేశారు. సుమారు రూ.కోటి విలువచేసే ఆస్తులను ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, జూదం, క్రికెట్ బెట్టింగ్, ల్యాండ్ సెటిల్‌మెంట్ వంటి అనేక నేరాల్లో మహ్మద్ కైసర్ ప్రమేయం ఉంది. మహ్మద్ కైసర్ జేబు దొంగగా జీవితాన్ని మొదలు పెట్టి.. ఇప్పుడు పేరుమోసిన రౌడీ షీటర్‌గా దాకా ఎదిగాడు.. భారీగా ఆస్తులు కూడబెట్టాడు. 2011లో సంవత్సరంపాటు నగర బహిష్కరణ కు గురయ్యాడు. మహ్మద్ కైసర్ పై క్రిమినల్ రికార్డ్ ఉంది. అతనిపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. FIRల ఆధారంగా ఈడీ  దర్యాప్తు చేస్తోంది. భార్య షాహెదా బేగంపేరు మీద అనేక స్థిరాస్తులు ఉన్నాయి. 2007 నుంచి 2020 వరకు చాలా ప్రాపర్టీలను కూడ బెట్టాడు.

ALSO READ | రూ.5 కోట్లు ఇవ్వకపోతే దారుణంగా హత్య చేస్తామంటూ స్టార్ హీరోకి బెదిరింపులు.