కేజ్రీవాల్‌‌కు నాలుగోసారి ఈడీ నోటీసులు

కేజ్రీవాల్‌‌కు నాలుగోసారి ఈడీ నోటీసులు
  •     ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో 18న విచారణకు రమ్మని పిలుపు

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్‌‌కు ఈడీ నాలుగో సారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే ప్రిపరేషన్స్‌‌ నేపథ్యంలో విచారణకు హాజరుకాలేనంటూ ఈ నెల 3న కేజ్రీవాల్ చెప్పారు. దీంతో 3 నెలల వ్యవధిలోనే నాలుగుసార్లు నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆప్ మండిపడింది.వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్‌‌ ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఇలా చేస్తోందని ఆరోపించింది.