కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను విచారించిన ఈడీ

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను విచారించిన ఈడీ

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో భాగంగా ఆయనకు ఈడీ నోటీసులు పంపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనను పిలిచినట్లు స్పష్టం చేశారు. మరోవైపు  అగస్టా వెస్ట్ లాండ్ చాపర్ కుంభకోణం కేసులో రక్షణశాఖ మాజీ కార్యదర్శి  శశికాంత్ శర్మకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులంతా ఏప్రిల్ 28న తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.  

తల్లి కాబోతున్న 'అత్తారింటికి దారేది' హీరోయిన్