న్యూ ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో అరెస్టై, జైల్లో ఉన్న మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ లీడర్ నవాబ్ మాలిక్ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అటాచ్ చేసింది. ఫిబ్రవరిలో దావూద్ ఇబ్రహీం, అతడి గ్యాంగ్‌పై పెట్టి న కేసులో మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. మాలిక్, అతని కుటుంబ సభ్యులు, సోలిడస్ ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, మాలిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్కు చెందిన రూ.5 కోట్ల విలువై న ఆస్తులను పీఎంఎల్ఏ కింద అటాచ్ చేశారు. కుర్లాలోని కమర్షియల్ యూనిట్, ఉస్మానాబాద్ జిల్లాలోని 147 ఎకరాల భూమి, కుర్లాలోని 2 ఫ్లాట్లు, బాంద్రా రెసిడెన్షియల్ ఫ్లాట్లు అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. మునీరా అనే మహిళకు చెందిన ఒక ప్రాపర్టీని నవాబ్ మాలిక్ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ ద్వారా దక్కించుకున్నా డు. ఈ కేసులోనే నవాబ్ మాలిక్ అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
