మల్విందర్‌, గోధ్వానీలను అరెస్టు చేసిన ఈడీ

మల్విందర్‌, గోధ్వానీలను అరెస్టు చేసిన ఈడీ

న్యూఢిల్లీ: రెలిగేర్‌‌ ఫిన్‌‌వెస్ట్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఎఫ్‌‌ఎల్‌‌) డబ్బులు స్వాహా చేసి మనీలాండరింగ్‌‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఫోర్టిస్‌‌ హెల్త్‌‌కేర్‌‌ మాజీ ప్రమోటర్‌‌ మల్విందర్‌‌ సింగ్‌‌, రెలిగేర్‌‌ ఎంటర్‌‌ప్రైజస్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఈఎల్‌‌) మాజీ సీఎండీ సునీల్‌‌ గోధ్వానిలను ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. తీహార్‌‌ సెంట్రల్‌‌ జైలు నుంచి వారిద్దరినీ అరెస్టు చేశారు. రెలిగేర్‌‌ స్కాములోనే  ఢిల్లీ పోలీసులు వారిని అరెస్టు చేసి, తీహార్‌‌ జైలులో ఉంచారు. మల్విందర్‌‌, గోధ్వానీల అరెస్టు సమాచారాన్ని ఈడీ తరఫు లాయర్‌‌ ఇక్కడి కోర్టుకు తెలియ చేశారు. వారిద్దరినీ ప్రశ్నించేందుకు ప్రొడక్షన్‌‌ వారంట్‌‌ జారీ చేయాల్సిందిగా ఆ కోర్టును కోరారు. ఐతే, సెంట్రల్‌‌ జైలులోని మెట్రోపాలిటన్‌‌ మెజిస్ట్రేట్‌‌ ముందే వారిని హాజరు పరచాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కొనసాగుతున్న లాయర్ల సమ్మె నేపథ్యంలో కోర్టు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది.

ED arrests ex-Fortis Healthcare promoter Malvinder Singh, Sunil Godhwani in RFL case