ఆంధ్రప్రదేశ్లో జరిగిన టీడీపీ.. జనసేన.. బీజేపీ కూటమి నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రధాని పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యంపై టీడీపీ.. బీజేపీ.. జనసేన పార్టీలు సీఈసీకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను త్వరగా విచారించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ ను ఆదేశించించింది. రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలు ఇచ్చిన వివరణను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా నమోదు చేశారు.
రాజకీయ హింస ఘటనలపై తక్షణం ఈసీఐకి నివేదిక పంపిస్తామని సీఈఓ తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చాక రాజకీయ హింస జరగకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామని, కోడ్ వచ్చిన మరుసటి రోజే హింసాత్మక ఘటనలు జరగడంతో ఈసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందనీ సీఈఓ తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలని ఈసీఐ ఎప్పటికప్పుడు గమనిస్తోందనీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
ప్రజాగళంలో సభలో మోదీ మాట్లాడుతున్న సమయంలో కార్యకర్తలు సౌండ్ సిస్టం వద్దకు వచ్చిన వారిని పోలీసులు నియంత్రించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. . దీంతో మోదీ ప్రసంగానికి పదేపదే ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆయన తన ప్రసంగాన్ని మూడుసార్లు ఆపాల్సి వచ్చిందని. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తీరుపై వేదిక పైనుంచే ఆగ్రహం వెలిబుచ్చారు. పోలీసులు బాధ్యతలు వదిలేశారని విమర్శించారు. బొప్పూడి సభకు వెళ్లే మార్గాల్లో ఇతర వాహనాలు దారి మళ్లించటంలో పోలీసుల వైపల్యం స్పష్టంగా కనిపించిందన్నారు.
Also Read :డ్రగ్స్ విషయంలో టీడీపీ...బీజేపీ నేతల పాత్ర ఉంది
హింసాత్మక ఘటనలు జరగకూడదని మరోమారు ఎస్పీలకు గట్టిగా చెప్పామన్నారు. రాజకీయ హింసను నిరోధించేలా అన్ని పార్టీలను హెచ్చరించాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో పరామర్శ చేసుకోవచ్చు కానీ,.. చెక్కుల పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. డబ్బుల పంపిణీ కోడ్ ఉల్లంఘనే అవుతుందని, దీనిపై జిల్లా కలెక్టర్లని నివేదికలు అడిగినట్లు తెలిపారు. కోడ్ ఉల్లంఘనలకు సంబధించి రాష్ట్ర వ్యాప్తంగా 200 వరకు వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు