బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్

  • నామినేషన్‌‌‌‌ పత్రాలతో బీఫాం జత చేయకపోవడంతో రిజెక్ట్‌‌‌‌ చేసిన రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌


నాగర్​ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ మంద జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన వేసిన నామినేషన్‌‌‌‌ను రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ రిజెక్ట్​చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఏ ఫాంతో పాటు పార్టీ ఇచ్చే బీఫాంను జత చేయని కారణంగా నామినేషన్‌‌‌‌ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీలో ఉండాలంటే కనీసం 10 మంది ఓటర్లు అభ్యర్థిని బలపర్చాల్సి ఉండగా, మంద జగన్నాథంను నలుగురు మాత్రమే బలపర్చారు. దీంతో ఇండిపెండెంట్‌‌‌‌గా కూడా పోటీ చేసే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. 

చాలా నిరాశగా ఉంది: మంద జగన్నాథం

నామినేషన్ రిజెక్ట్ కావడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని మంద జగన్నాథం అన్నారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన తనకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదన్నారు. నామినేషన్ వేసిన రోజు పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి ఇచ్చారని, పార్టీ బీ ఫాం జత చేశారా లేదా అన్నది తాను చూసుకోలేదన్నారు. కాగా, చివరి నిమిషంలో బీఎస్పీ నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌ ఎంపీ అభ్యర్థిగా బీసమోల్ల యేసోబు నామినేషన్‌‌‌‌ దాఖలు చేయగా, రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ఓకే చేశారు. దీంతో పార్టీ తరఫున యేసోబు బరిలో నిలిచినట్లు అయింది.