గడ్డం పెరగక.. నలుగురిలో నవ్వులు పాలవుతూ ఏడాది మొత్తం గడిపేశారా..! కొత్త ఏడాదైనా ఆ ఇబ్బందులకు ముగింపు పలకండి. ఈ కింద చెప్పిన ఆహారాన్ని తిని గడ్డాన్ని పెంచటమే కాదు.. మీకు నచ్చిన ఆకృతులలో గడ్డాన్ని సరి చేస్తూ తోటివారిని కనువిందు చేయండి.
ఇంట్లో తినే ఆహారంతోనే గడ్డం, మీసం దట్టంగా పెంచుకోవచ్చు. విటమిన్- ఈ గడ్డం మృదువుగా పెరిగేందుకు సహాయపడుతుంది. కాయగూరలు, బీన్స్, ఆకుకూరల వల్ల పుష్కలంగా విటమిన్ ఈ అందుతుంది. దీంతో పాటు విటమిన్ -ఎ, బీటా కెరోటిన్ లభించే పాలకూర, గుడ్డు పచ్చసొన, చీజ్, క్యారట్లు, చిలగడ దుంపలు, గుమ్మడికాయ తరచుగా తీసుకోవడం ద్వారా గడ్డం పెరుగుతుంది. గుడ్లు, లీన్ మీట్, చేపలు, బీన్స్, పాలు.. లాంటి పదార్థాల్లో ప్రొటీన్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్ గడ్డం పెరుగుదలలో సహాయపడుతుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, శరీరంలో ప్రొటీన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇవి గడ్డం దట్టంగా పెరగడం లో సహకరిస్తాయి. మేకరల్, టూనా, సాల్మోన్, సార్డినెస్ మొదలైన వాటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి తినడం వల్ల గడ్డం సరైన దిశలో పెరుగుతుంది. ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, పిప్పరమెంటు నూనె వంటివి వెంట్రుకల పోషణకు ఉపయోగప డతాయి. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం, తక్కువ ఒత్తిడి, ఎక్కువ నిద్ర గడ్డం వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ప్రొటీన్ ఎక్కువ జుట్టు పెరగటానికి సరైన పోషకాల ను అందిస్తుంది. వీటితో పాటు ప్రతి రోజు 8 గ్లాసుల నీటిని తాగితే గడ్డం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇంకెందుకు ఆలస్యం. ఆరోగ్య నిపుణులు చెప్పిన ఆహారాన్ని ఆరగించండి.. గడ్డాన్ని ఏపుగా పెంచండి.
(వెలుగు లైఫ్)