తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం

తెలుగు రాష్ట్రాల్లో  భూ ప్రకంపనలు  వచ్చాయి. డిసెంబర్ 4న ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఇల్లు,అపార్ట్ మెంట్లో  ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక కంగారుపడ్డారు. భయాందోళనకు గురయ్యారు.

ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, విజయవాడ,విశాఖపట్నం,నందిగామ,గుడివాడ, మంగళగిరి, తిరువురూ,ఏలూరులో పలు చోట్ల  రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.  భయంతో జనం బయటకు పరుగులు తీశారు. 

తెలంగాణలో రిక్టర్ స్కేలుపై 3.5

తెలంగాణలో  ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా,  ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది.  హైదరాబాద్ లోని పలు చోట్ల రెండు సెకన్ల  పాటు భూమి కంపించింది. జనం భయాందోళనతో  ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదయ్యిందని అధికారులు తెలిపారు. భూమి లోపల 40 కి.మీ లనుంచి రేడియేషన్ ఉద్భవించిందని చెప్పారు.