టీకా సేఫ్​.. 1,91,181 మందికి తొలిరోజు వ్యాక్సినేషన్

టీకా సేఫ్​.. 1,91,181 మందికి తొలిరోజు వ్యాక్సినేషన్
3,352 సెంటర్లలో వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా ఫస్ట్​ డే సాఫీగా సాగిన వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఎవరూ హాస్పిటలైజ్ కాలే: హెల్త్ మినిస్ట్రీ ఎయిమ్స్ శానిటేషన్ వర్కర్​కు దేశంలోనే తొలి టీకా యూపీలో 21,291 మందికి, ఏపీలో 18,412 మందికి వ్యాక్సిన్ కొవాగ్జిన్​తో సైడ్​ఎఫెక్ట్స్​ వస్తే పరిహారమిస్తం: భారత్​ బయోటెక్​ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కొమ్ములు విరిచే పని మొదలైంది. దేశంలో కోటి మందిని గోస పెట్టి.. లక్షన్నర మందిని బలి తీసుకున్న కరోనాను చరిత్రలో కప్పిపెట్టడమే లక్ష్యంగా వ్యాక్సినేషన్ షురూ అయింది. సైంటిస్టులు, రీసెర్చర్లతో మొదలు.. అధికారులు, డాక్టర్ల చొరవతో తొలి రోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ సూపర్ సక్సెస్ అయింది. దేశవ్యాప్తంగా 3,352 సెంటర్లలో 1,91,181 మందికి టీకా వేశారు. ఎక్కడా, ఎవరికీ పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని, టీకా తీసుకున్న వాళ్లందరూ సేఫ్​గా ఉన్నారని హెల్త్ డిపార్ట్​మెంట్ వర్గాలు వెల్లడించాయి. 3 లక్షల మందికి ఇవ్వాలనుకుంటే.. తొలిరోజు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో  కలిపి 3 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రతి సెంటర్​లో 100 మందికి వేయాలని భావించింది. అయితే శనివారం సాయంత్రానికి 3,352 సెంటర్లలో తొలి రోజు 1,91,181 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎవరూ హాస్పిటలైజ్ కాలేదని వెల్లడించింది. అయితే కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు మాత్రం వచ్చాయని పేర్కొంది. అంతకుమించి ఎవరికీ పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ చూపెట్టలేదని, టీకా తీసుకున్న వాళ్లందరూ సేఫ్​గా ఉన్నారని తెలిపింది. తొలి టీకా ఎయిమ్స్ శానిటేషన్ వర్కర్ మనీశ్ కుమార్​కు, రెండో టీకా హెల్త్ వర్కర్ ధావల్ ద్వివేదికి వేశారు. వారి తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సీనియర్ మెంబర్ వీకే పాల్​కు వేశారు. దేశవ్యాప్తంగా 16,755 మంది వ్యాక్సినేషన్ డ్యూటీలో పాల్గొన్నారు. ఎయిమ్స్ లో జరిగిన వ్యాక్సినేషన్ డ్రైవ్​లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ పాల్గొన్నారు. హెల్త్ కేర్, ఫ్రంట్​లైన్ వర్కర్ల వ్యాక్సినేషన్ ఖర్చును కేంద్రమే భరించనుంది. పండుగలా ప్రోగ్రామ్.. వ్యాక్సినేషన్ డ్రైవ్ పండుగలా సాగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక హాస్పిటళ్లు, హెల్త్ సెంటర్లను రంగురంగుల పువ్వులు, బెలూన్లు అలంకరించారు. చాలా చోట్ల ప్రార్థనలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. వ్యాక్సిన్లు ఉంచిన పెట్టెకు పూల దండ వేసి, ఓ నర్సు హారతి ఇవ్వడం ఓ వీడియోలో కనిపించింది. మధ్యప్రదేశ్​లో హెల్త్ కేర్ వర్కర్లను పూలతో ఆహ్వానించారు. గ్వాలియర్​లో ని ఓ గుడిలో డాక్టర్లు పూజలు చేశారు. ‘‘మానవాళికి ఇది గొప్పరోజు. తొలి డోస్ తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా” అని కోల్​కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్ బిపాషా సేత్ చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కు నిదర్శనం: అమిత్ షా దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ప్రారంభమైందని, ఇది ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి నిదర్శమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కరోనాపై పోరులో ఇదొక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. సైంటిస్టులు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కంగ్రాట్స్ చెప్పారు. శనివారం వరుసగా ట్వీట్లు చేశారు. మానవజాతి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభంపై విజయం సాధించిన కొన్ని దేశాల్లో ఇండియా ఒకటని పేర్కొన్నారు. మోడీ నేతృత్వంలో కొత్త ఇండియా రూపుదిద్దుకుంటోందని.. విపత్తులను అవకాశాలుగా, సవాళ్లను విజయాలుగా మలుచుకుంటోందని అన్నారు. సీరమ్ సీఈఓ కూడా.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను దేశంలో తయారు చేసిన సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ఇండియా సీఈఓ అదర్ పూనావాలా టీకా వేయించుకున్నారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన ఇండియా.. అందులో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇందులో మేం భాగస్వాములమైనందుకు గర్వంగా ఉంది. కొవిషీల్డ్ పై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు మా హెల్త్ స్టాఫ్ తో కలిసి నేను కూడా టీకా వేయించుకున్నా” అని పూనావాలా శనివారం ట్వీట్ చేశారు. పలువురు పొలిటీషియన్స్‌‌‌‌కు.. ఢిల్లీ గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుద్ధ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ, బీజేపీ నేత మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినిస్టర్ నిర్మల్ మాజి, టీఎంసీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చటర్జీ, సుభాష్ మొండల్ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయించుకున్నారు. డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ నోయిడాలోని కైలాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీకా తీసుకున్నట్లు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్గాలు చెప్పాయి. రోగుల సంక్షేమ కమిటీలో మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న రవీంద్రనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా టీకా వేయించుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇక ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ మెంబర్ వీకే పౌల్ కూడా ఢిల్లీ ఎయిమ్స్​లో టీకా వేయించుకున్నారు. వారం రోజుల సంది భయపడ్డం లిస్టులో ఫస్ట్ పేరు నాదే ఉంది. వ్యాక్సిన్ వేయించుకుంటానని చెప్తే మా పిల్లలు వద్దన్నరు. వ్యాక్సిన్ వేసుకున్నాక ఏమవుతుందోనని వారం రోజుల సంది భయపడినం. మా సూపరింటెండెంట్ సార్​ ధైర్యం చెప్పారు. వ్యాక్సిన్‌‌తో ఎలాంటి రియాక్షన్స్ ఉండవని, ఒకవేళ ఏదైనా జరిగినా బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ రోజు నేను టీకా తీసుకున్నా. నా ఆరోగ్యం బాగానే ఉంది. వ్యాక్సిన్‌‌ తీసుకున్నాక ఓ అరగంట అక్కడ్నే ఉన్న. మాలో ఎవరికీ ఎలాంటి సమస్యలూ రాలేదు. అందరూ  భయం లేకుండా టీకా తీసుకోవాలని కోరుతున్నా ‑ సుంకిశాల కిష్టమ్మ, రాష్ట్రంలో ఫస్ట్​ వ్యాక్సిన్​ తీసుకున్న శానిటేషన్ వర్కర్‌‌ మనీశ్ కుమార్​కు దేశంలోనే తొలి టీకా దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి వ్యక్తిగా శానిటేషన్ వర్కర్ మనీశ్ కుమార్​నిలిచాడు. ఎయిమ్స్​లో పని చేస్తున్న  33 ఏళ్ల మనీశ్​కు అక్కడే టీకా వేశారు. ‘‘ఇది చాలా మంచి అనుభవం. టీకా వేసుకునేందుకు నేను భయపడలేదు. ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ విషయంలో నాకు ఎలాంటి సందేహాలు లేవు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి’’ అని మనీశ్ కుమార్ చెప్పాడు. తాను 8 ఏళ్లుగా ఎయిమ్స్​లో పని చేస్తున్నట్లు తెలిపాడు. తన తల్లితోపాటు తన ఫ్యామిలీలో చాలా మంది ఎయిమ్స్​లో నర్సింగ్, శానిటేషన్ స్టాఫ్​లో ఉన్నట్లు పేర్కొన్నాడు.