అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఆన్ లైన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అన్నీరకాల గాడ్జెట్స్ తో పాటు కన్జ్యూమర్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి
అయితే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ తో సహా ఇ-కామర్స్ సంస్థలు కరోనా వైరస్ చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అమ్మకాలు జరుపుతున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
ఆన్ లైన్ లో అమ్మకాలపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇ-కామర్స్ కంపెనీలు నిబంధనలకు కట్టుబడి గ్రీన్, ఆరెంజ్ స్పాట్లలో మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది.
అన్ని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో సహా రెడ్ జోన్లలో ఉన్న వినియోగదారులు డెలివరీ సదుపాయం లేదు. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ వివరాల ప్రకారం కేంద్రప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఆయా జోన్లలో మాత్రమే ఆర్డర్లను అందిస్తామని, సాధారణ రోజుల్లో అందించే సమయం కంటే లాక్ డైన్ పిరియడ్ లో డెలివరీ చేసే సమయం ఎక్కువ అని తెలిపింది.
