పాలమూరు ఎస్పీ ఆఫీసుల్లో ఆయుధ పూజ

పాలమూరు, వెలుగు : దసరా వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమిని పురస్కరించుకుని గురువారం ఎస్పీ ఆఫీసులో ఆయుధ, వాహన పూజ నిర్వహించారు.  డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎస్పీ జానకి ఆయుధ పూజలో పాల్గొన్నారు.  ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో దసరా పండుగ సందర్భంగా ఆయుధపూజ, వాహనపూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, భరత్, డీఎస్పీ  శ్రీనివాస్, సీఐ కనకయ్య, ఎస్​ఐ గోవర్ధన్ పాల్గొన్నారు. 

వనపర్తి, వెలుగు: దసరా నవరాత్రి  ఉత్సవాలలో భాగంగా 8వ రోజు  దుర్గాష్టమిని పురస్కరించుకుని  జిల్లా కేంద్రంలోని సాయుధ దళ పోలీసు కార్యాలయంలో ఎస్పీ దంపతులు ఆయుధ పూజ నిర్వహించారు. 

గద్వాల, వెలుగు: సొసైటీలో చెడును పారదోలేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం సాయంత్రం ఆఫీసులో సతీ సమేతంగా ఆయుధపూజ నిర్వహించారు.