దుర్గా వాహిని ర్యాలీ

వీహెచ్​పీ మహిళా విభాగమైన దుర్గా వాహిని ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేటలో ర్యాలీ నిర్వహించారు. చైతన్యపురి నుంచి కొత్తపేట, విక్టోరియా మెమోరియల్ మీదుగా సాగిన ర్యాలీలో దాదాపు 1500 మంది యువతులు పాల్గొన్నారు. అనంతరం అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో యువతుల శక్తి ప్రదర్శన ఆకట్టుకుంది. నేటితరం యువతులు వీర నారీమణుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని వీహెచ్​పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతా రెడ్డి, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కు భాయి, చీఫ్ గెస్ట్ డాక్టర్ శిరీష, ప్రవచనకర్త డాక్టర్ శిల్ప పిలుపునిచ్చారు. చిన్నారులు భరతమాత, వీర నారీమణుల వేషధారణలతో అలరించారు.