LuckyBaskhar: లక్కీ భాస్కర్ ట్విట్టర్ రివ్యూ.. దుల్కర్ బ్లాక్బస్టర్ భాస్కర్ అనిపించుకున్నాడా?

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’.  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. దీపావళి కానుకగా ఇవాళ గురువారం (అక్టోబర్ 31న) వరల్డ్‌‌వైడ్‌‌గా లక్కీ భాస్కర్ మూవీ థియేటర్లలో రిలీజైంది. 

సీతారామం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..కాగా ఈ మూవీ ప్రీమియర్స్ బుధవారం అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజై.. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

లక్కీ భాస్కర్ మూవీ ప్రివ్యూ చూసిన తర్వాత నిర్మాత స్వప్న దత్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. "ఈ దివాలీకి బ్లాక్ బస్టర్ భాస్కర్ వచ్చేస్తున్నాడు. నా ఫ్రెండ్ దుల్కర్ సల్మాన్.. ఎప్పటిలాగే భాస్కర్ పాత్రలో అదరగొట్టేశాడు. వెంకీ అట్లూరి చాలా బాగా తీశాడు. మీనాక్షి చౌదరి కూడా బాగుంది. భాస్కర్ ప్రపంచం చాలా కూల్ గా ఉంది" అని స్వప్న దత్ తెలిపింది. 

దుల్కర్ సల్మాన్‌కు లక్కీ భాస్కర్ మూవీ బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ అని.. ఇందులో టాప్ లెవెల్‌లో స్క్రీన్ ప్లే ఉందని.. అంతే మొత్తంలో క్యారెక్టర్లు డిజైన్ చాలా బలంగా ఉన్నాయని అంటున్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ మంచి సినిమా ఎలా తీయవచ్చోనని తీసి చూపించారు. జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఎలివేషన్ కేక పెట్టించాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ మూవీ కోసం వెంకీ అట్లూరి చాలానే రీసెర్చ్ చేశాడని కనిపిస్తుందట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను అద్భుతంగా ప్రజెంట్ చేశాడట.. దుల్కర్ అద్భుతంగా నటించేశాడట.. జీవీ ప్రకాష్ ఆర్ఆర్ ఈ సినిమాకు ప్రాణం పోసిందట. సెకండాఫ్ కాస్త ల్యాగ్‌ అనిపిస్తుందట. ఇంటర్వెల్, క్లైమాక్స్, ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందట. ఎకానమీ బేస్డ్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు.

దుల్కర్ కమ్ బ్యాక్ అదిరిపోయింది.. స్క్రీన్ ప్లే టాప్ నాచ్‌లో ఉంది.. అన్ని పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంది.. ఇట్ల ఓ సినిమాను తీయాలి.. మూవీని తీసే పద్దతి ఇది.. క్లైమాక్స్ అదిరిపోయింది.. జీవీ ప్రకాష్ ఈ మూవీకి ప్రాణం పెట్టేశాడు. మాస్ ఎలివేషన్స్ ఇచ్చేశాడంటూ ఇలా నెటిజన్లు ఒక్కో సీన్ గురించి వివరించి చెబుతున్నారు.

డైరెక్టర్ వెంకీ అట్లూరి సింపుల్ సబ్జెక్ట్‌ను రేసీ స్క్రీన్ ప్లేతో అద్బుతంగా చెప్పాడు. దుల్కర్ సల్మాన్.. మంచి స్క్రిప్ట్ ఇచ్చి.. యాక్షన్ అని అరవండి.. నేను ఎలా నటిస్తానో చూపిస్తాడు. దుల్కర్ సల్మాన్ నటన అద్బుతంగా ఉంది. ఇక థియేటర్లలోకి జనం కిక్కిరిసిపోవడమే తరువాయి అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

దర్శకుడు వెంకీ అట్లూరి స్మార్ట్, స్టైలిష్. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్‌ను ఇంత ఎంగేజింగ్‌గా, ఇంత ఎమోషనల్‌గా ఎవ్వరూ చెప్పలేదు.. మ్యూజిక్, విజువల్స్ అన్నీ అదిరిపోయాయి.. రియల్ స్కామ్‌కు ఫిక్షనల్ కారెక్టర్‌లను అద్భుతంగా కలిపాడని అంటున్నారు. గొప్ప సంగీతం మరియు విజువల్స్‌తో ఆకర్షణీయమైన పద్ధతిలో ఆర్థిక మోసాలకు సంబంధించిన లోతైన, వినోదభరితమైన డైవ్. సినిమా అంతటా చాలా హై మూమెంట్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయని.. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తన టెంపోతో అదరగొట్టేసాడు.