Dulip Samaraweera: శ్రీలంక మాజీ క్రికెటర్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ 20 ఏళ్ళు నిషేధం

శ్రీలంక మాజీ టెస్టు క్రికెటర్ దులిప్ సమరవీరపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 20 ఏళ్ల నిషేధం విధించింది. విక్టోరియా మహిళా జట్టు కోచ్‌గా పనిచేస్తున్న అతను ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది. సిఎ ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.23ని ఉల్లంఘించే విధంగా సమరవీర అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు ప్రవర్తనా సంఘం గుర్తించింది. క్రికెట్ విక్టోరియా (CV)లో సమరవీర కోచింగ్ చేస్తున్న సమయంలో ఒక మహిళా క్రికెటర్ తో అనుచిత ప్రవర్తన కారణంగా అతనిపై ఆరోపణలు వచ్చాయి. 

Also Read :- తొలి రోజు మనదే.. భారత్‌ను నిలబెట్టిన అశ్విన్, జడేజా

ఇందులో భాగంగా విచారణను ఎదుర్కొంటున్నాడు. 52 ఏళ్ల అతను రాబోయే రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ఆస్ట్రేలియాలో ఎలాంటి పదవులు నిర్వహించడానికి వీలు లేదు. శ్రీలంక తరపున ఏడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడిన సమరవీర.. మొదటిసారి బ్యాటింగ్ కోచ్‌గా 2008లో క్రికెట్ విక్టోరియాలో చేరాడు. గత ఏడాది నవంబర్‌లో మహిళల జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్ లో 7 టెస్టుల్లో 211 పరుగులు.. 5 వన్డేల్లో 91 పరుగులు చేశాడు.