రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • నేటి నుంచి దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌

అనంతపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: దులీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రంగం సిద్ధమైంది. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు వెళ్లిపోవడంతో ఇప్పుడు యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. గురువారం నుంచి ఇండియా–ఎ, డి.. ఇండియా–బి, సిల మధ్య మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జరగనున్నాయి. ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సెలెక్టర్లు ఎక్కువగా ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న రింకూపై ప్రత్యేక దృష్టి నెలకొంది. శుభమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమిండియాకు వెళ్లిపోవడంతో అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మయాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా–ఎ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. 2022 మార్చిలో చివరి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడిన మయాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇందులో రాణించి టీమిండియా తలుపు తట్టాలని భావిస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండనున్నాడు.