నేటి నుంచి దులీప్ ట్రోఫీ చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అనంతపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: తమ ఫస్ట్ క్లాస్​ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్న శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్, సంజు శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రియాన్ పరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దులీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో ఆఖరి పోరుకు సిద్ధమయ్యారు. మెగా టోర్నీ మూడో, చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గురువారం మొదలవుతున్నాయి. టోర్నీలో నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్ లేకపోవడంతో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు ట్రోఫీ నెగ్గనుంది.

ప్రస్తుతం ఇండియా–సి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా తొమ్మిది పాయింట్లు రాబట్టి అగ్రస్థానంలో ఉండగా.. ఇండియా–బి (7), ఇండియా–ఎ (6), ఇండియా–డి (0) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రతురాజ్ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీలోని ఇండియా–సి.. మయాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగర్వాల్ కెప్టెన్సీలోని ఇండియా–ఎ జట్టుతో తలపడనుండగా, అభిమన్యు ఈశ్వరన్ నేతృత్వంలోని ఇండియా–బి జట్టుతో ఒత్తిడిలో ఉన్న శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని ఇండియా–డి పోటీ పడనుంది.