దులీప్‌‌‌‌ ట్రోఫీ విన్నర్‌‌‌‌ ఇండియా–ఎ

అనంతపూర్‌‌‌‌: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో రాణించిన ఇండియా–ఎ జట్టు దులీప్‌‌‌‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌‌‌‌ల్లో రెండు విజయాలతో 12 పాయింట్లు సాధించి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. ఇండియా–సితో ఆదివారం ముగిసిన మూడో మ్యాచ్‌‌‌‌లోనూ 132 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచింది. 350 రన్స్‌‌‌‌ ఛేజింగ్‌లో సాయి సుదర్శన్‌‌‌‌ (111) సెంచరీతో చెలరేగినా.. ఇండియా–-సి  81.5 ఓవర్లలో 217 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. రుతురాజ్‌‌‌‌ (44) పోరాడినా విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ (17), ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (17) నిరాశపర్చారు. ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, తనుష్‌‌‌‌ చెరో మూడు, అకీబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు 270/6 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇండియా–-ఎ రెండో ఇన్నింగ్స్‌‌‌‌ను 66 ఓవర్లలో 286/8 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌ చేసింది. కుమార్‌‌‌‌ కుశాగ్ర (42), తనుష్‌‌‌‌ కొటియాన్‌‌‌‌ (26 నాటౌట్‌‌‌‌) ఫర్వాలేదనిపించారు. గౌరవ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ 4 వికెట్లు తీశాడు. శాశ్వత్‌‌‌‌ రావత్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ అదుర్స్‌‌‌‌..

పేసర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (6/40) కెరీర్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ బౌలింగ్‌ నమోదు చేయడంతో.. ఇండియా–బితో జరిగిన మరో మ్యాచ్‌‌‌‌లో ఇండియా–డి 257 రన్స్‌‌‌‌ భారీ తేడాతో నెగ్గింది. ఇండియా–డి నిర్దేశించిన 373 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌లో ఇండియా–బి రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 22.2 ఓవర్లలో 115 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (40 నాటౌట్‌‌‌‌) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌కు తోడుగా ఆదిత్య థాక్రే (4/59) అండగా నిలిచారు. అంతకుముందు ఇండియా–డి రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 58.3 ఓవర్లలో 305 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. రికీ భుయ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.