మేడ్చల్ పెద్ద చెరువు కట్ట కుగింది

మేడ్చల్ మల్కాజ్ గిరి: భారీ వర్షాల కారణంగా మేడ్చల్ పెద్ద చెరువు కట్టకుంగింది. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద చెరువు మత్తడి దుంకుతుంది.. ఈ క్రమంలో చెరువు అలుగు కణాలపై ఉన్న కట్ట కుంగింది. 

పెద్ద చెరువు అలుగు భారీగా వస్తుండడంతో మేడ్చల్ పోలీసులు, మేడ్చల్ మున్సిపాలిటీ అధికారులు చెరువు కట్ట పైకి ఎవరిని అనుమతించడంలేదు. మేడ్చల్ మార్కెట్ నుండి మేడ్చల్ చెక్ కు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ALSO READ : అయ్యో పాపం : భారీ వర్షాలకు కళ్ల ముందే కూలిన ఇల్లు