డుకాటి తన ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ టూరర్ బైక్‌ను మల్టీస్ట్రాడా వీ4 పైక్స్ పీక్ బైకును రూ. 31.48 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లాంచ్ చేసింది. దీని ధర మల్టీస్ట్రాడా వీ4 ఎస్ కంటే రూ. 7.33 లక్షలు ఎక్కువ. బైకులోని లిక్విడ్-కూల్డ్ 1,158సీసీ వీ4 ఇంజన్ 10,500 ఆర్పీఎం వద్ద 170 హెచ్‌పీని, 8,750 ఆర్పీఎం వద్ద 125ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇస్తుంది. ఇందులో ఆరు గేర్లు ఉంటాయి.
22 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను అమర్చారు. 6.5-అంగుళాల టీఎఫ్టీ డాష్‌బోర్డ్, డుకాటీ కనెక్ట్ సిస్టమ్, మ్యాప్ నావిగేటర్, డుకాటి రేస్ రైడింగ్ మోడ్, డుకాటి వీలీ కంట్రోల్, ఏబీఎస్ కార్నరింగ్ వంటి అదనపు ఆకర్షణలు ఉన్నాయి.
