బెంగళూరు: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లయిట్స్‌పై దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తాత్కాలిక నిషేధం విధించింది. కరోనా పాజిటివ్ పేషెంట్స్‌ను తమ విమానాశ్రయానికి తీసుకొచ్చినందుకు గాను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సస్పెన్షన్ వేసింది. రెండు వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు కరోనా పాజిటివ్ పేషెంట్స్‌ను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తమ ఫ్లయిట్స్‌లో దుబాయ్ తీసుకొచ్చింది. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై దుబాయ్ సివిల్ ఏవియేషన్ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై టెంపరరీ బ్యాన్ విధించిన దుబాయ్.. సదరు కరోనా పాజిటివ్ పేషెంట్స్‌కు అవసరమయ్యే మెడికల్, క్వారంటైన్ ఖర్చులనూ సంస్థే భరించాలని పేర్కొంది. శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ సస్పెన్షన్ వచ్చే నెల 3న ముగియనుంది.
