దుబాయిలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ కార్పెట్ గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. ఈ ఫ్లవర్ కార్పెట్ ఏర్పాటుకు మొత్తం 41,444 కేజీల బంతిపువ్వులను ఉపయోగించారు. ఈ బంతిపువ్వులను కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి దుబాయికి బోయింగ్ 777 విమానంలో పంపించారు. ఈ విషయాన్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తెలిపింది. దుబాయి ఫెస్టివల్ సిటీలో ఫ్లవర్ ఆఫ్ టోలరెన్స్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ ఫ్లవర్ కార్పెట్ ప్రపంచంలోనే అతిపెద్ద నాచురల్ ఫ్లవర్ కార్పెట్ గా రికార్డు సృష్టించింది. ఈ ఫ్లవర్లను బెంగళూరు సిటీతోపాటు దేవనహల్లి, చిక్కబల్లాపుర ప్రాంతాల నుంచి దుబాయికి తరలించారు. 2016 ఇటలీలో 3980.84 చదరపు మీటర్లలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ కార్పెట్ రికార్డు క్రియేట్ చేసింది. దాన్ని లేటెస్ట్ గా దుబాయిలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ కార్పెట్ బ్రేక్ చేసింది. ఈ ఫ్లవర్ కార్పెట్ ను 5,426.65 చదరపు మీటర్లలో ఏర్పాటు చేసి సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పారు.

