ఎప్పుడూ వేలాదిమంది ప్రయాణికులతో కళకళలాడే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ శనివారం ఇట్లా ఒక్క మనిషి కూడా లేకుండా ఖాళీగా కనిపించింది. కరోనా వైరస్ కారణంగా అనేక దేశాల నుంచి విమాన సర్వీసులు రద్దు కావడం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా 85 కరోనా కేసులు రిజిస్టరవడంతో దుబాయ్ ఎయిర్ పోర్టుకు రాకపోకలు బాగా తగ్గిపోయాయి. 7,200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుబాయ్ ఎయిర్ పోర్టు ప్రపంచంలోనే బిజీ విమానాశ్రయాల్లో మూడోది. ‘డీఎక్స్బీ’ అని పిలిచే ఈ ఎయిర్ పోర్ట్ నుంచి వారానికి 7,700 విమాన సర్వీసులు నడుస్తుంటాయి. అరబ్ ప్రపంచంలో ఎక్కువ ప్రయాణాలు ఈ ఎయిర్ పోర్టునుంచే జరుగుతాయి. ఎయిర్ పోర్టు దాదాపుగా మూతపడినట్టే ఉండడంతో అక్కడ వందల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో బిజినెస్ కూడా సాగడంలేదు.

