న్యూఢిల్లీ : బాలికపై అత్యాచారం ఆరోపణలతో అసోంలో డీఎస్పీని అరెస్టు చేశారు. ఇంట్లో పనిచేసే 15 ఏండ్ల బాలికను రేప్చేసినట్లు ఫిర్యాదు రావడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఆ రాష్ట్ర డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. కిరణ్నాథ్ అనే పోలీస్ ఆఫీసర్ గోలాఘాట్ జిల్లాలోని లాచిత్ బోర్ఫుకాన్ పోలీస్ అకాడమీలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.
బాధితురాలు ఆయన ఇంట్లో పనిమనిషి.. డీఎస్పీ తనను ఇంట్లో బంధించి పలుమార్లు రేప్చేశాడని, చిత్రహింసలకు గురిచేశాడని బాధితురాలు డేర్గావ్ పోలీస్ స్టేషన్లో శనివారం కంప్లైంట్ చేసింది. ఎంక్వైరీలో లభించిన ఆధారాలతో డీఎస్పీని అరెస్టు చేసినట్లు డీజీపీ జ్ఞానేంద్ర తెలిపారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని, కేసు ఎంక్వైరీ జరుగుతోందని చెప్పారు.
