డీఎస్సీ అభ్యర్థుల వినతి: ఫైనల్​ కీలో తప్పులున్నాయి.. సరిచేయండి సారూ.. 

పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన డిఎస్సి ఫైనల్ కీ లో తప్పులు ఉన్నాయని ... వాటిని సరిచేసి మరోసారి ఫైనల్ కీ విడుదల చేయాలని డిఎస్సి అభ్యర్థులు అధికారులను కోరారు. హైదరాబాద్ లక్డికపుల్ లోని పాఠశాల విద్య శాఖ కమిషనర్ ను కలిసి వినతిపత్రాన్ని అభ్యర్థులు అందజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన మొదటి డీఎస్సీలో అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము మార్కులు కోల్పోతున్నామన్నారు. ప్రైమరీ కీ ను ఆగస్టు 13 న రిలీజ్ చేశారని... అందులో తప్పులు ఉన్నాయని మొరపెట్టుకున్నామని , తిరిగి ఫైనల్ కీ లో కూడా అదే తరహా తప్పులు దొర్లాయన్నారు. అధికారులకు ఆ తప్పులకు సంబందించిన అన్ని వివరాలను అందజేశామని తెలిపారు. ఫైనల్ కీ లో తప్పులను సరిదిద్ది , తాము కోల్పోయిన మార్కులను కలిపి , రిజల్ట్స్ విడుదల చేయాలని కోరారు.