హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ పైనే రాళ్ల దాడి.. వాహనాలు ధ్వంసం

హైదరాబాద్ జంట నగరంలో షాకింగ్ ఇన్సిడెంట్.. పోలీస్ స్టేషన్ పైనే రాళ్ల దాడి.. అంతటితో ఆగకుండా ఏకంగా.. పోలీసులపైనే దాడికి ప్రయత్నం చేసిన ఘటన సంచలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సికింద్రాబాద్ ఏరియాలోని గోపాలపురం పోలీస్ స్టేషన్. 2024, డిసెంబర్ 19వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. మందు కొట్టి రోడ్డుపై అల్లరి చేస్తున్న ఓ జంట ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే రాళ్లతో దాడి చేసింది.  ఫుల్ గా తాగి.. సోయి లేకుండా ఉన్న వీళ్లు.. పోలీస్ స్టేషన్ ఆవరణలో రెచ్చిపోయారు.

చేతికి ఏది దొరికితే అవి తీసుకుని పోలీసులపైనే దాడి చేశారు. రాళ్లతో పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. ఈ రాళ్ల దాడిలో పోలీస్ వాహనాలు దెబ్బతిన్నాయి. జీపు అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దటానికి.. వాళ్లను అదుపు చేయటానికి పోలీస్ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేదు. వాళ్లపైనా రాళ్లు రువ్వారు. ఈ ఘటనతో షాక్ అయిన స్థానికులు సైతం.. భయాందోళనలకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే ఫుల్ గా మందుకొట్టి.. సోయి లేకుండా ఉండటంతో వాళ్లను కంట్రోల్ చేయటం కష్టంగా మారింది. 

ALSO READ : విధుల్లో ఉన్న హోంగార్డుని ఢీకొట్టిన బైక్

చివరికి పోలీస్ సిబ్బంది అంతా కలిసి.. ఆ తాగుబోతు జంటను బలవంతంగా అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నామో.. ఎవరిపై రాళ్ల దాడి చేస్తున్నారో కూడా తెలియనంతగా వాళ్లు తాగినట్లు తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ రాళ్ల దాడి చేసిన ఈ జంటపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు గోపాలపురం పోలీసులు.