రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ముందంజ

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ముందంజ

రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది. పార్లమెంటు హౌస్ లోని రూం నెంబర్ 63లో అధికారులు ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. పోలైన ఓట్లలో 15 చెల్లలేదు.  ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు వచ్చాయని వాటి విలువ 3,78,000 అని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ప్రకటించారు. ఇక విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు రాగా వాటి విలువ 1,45,600గా లెక్కగట్టారు. ప్రస్తుతం అల్పాబెటికల్ ఆర్డర్లో రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్లు లెక్కిస్తున్నారు. సాయంత్రానికి తుది ఫలితం వెలువడే అవకాశముంది.