Health Milk : ఏ వయస్సులో ఎన్ని పాలు తాగాలి.. రోజుకు ఎంత తాగాలి..?

పాలు.. ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో కామన్.. పిల్లలు పాలు తాగితే.. పెద్దలు టీ, కాఫీ తాగుతారు. ఉదయం పూట పాలు లేని ఇళ్లు ఉండదు.. మరి ఏ వయస్సు వారు ఎంత పాలు తాగాలి.. ప్రతి రోజూ ఎంత తీసుకోవాలి అనేది మాత్రం చాలా మంది తెలియదు.. ఏ వయస్సు పిల్లలు ఎన్ని పాలు తాగాలి అనేది చాలా మంది పేరంట్స్ కు అవగాహన లేదు.. పాలు ఎక్కువ తాగినా నష్టమే.. అనారోగ్యం బారిన పడతారు.. అందుకే మీ కోసం ఈ సమాచారం..

ఎన్ని పాలు తాగాలి అంటే :

పుట్టిన తర్వాత 3 సంవత్సరాల వరకు రోజుకు 300 నుంచి 500 మిల్లీ లీటర్ల వరకు పాలు తాగాలి. 
4 నుంచి 10 ఏళ్ల వయస్సు వరకు పిల్లలు.. రోజూ 400 నుంచి 600 మిల్లీలీటర్ల వరకు పాలు తాగాలి.
11 నుంచి 18 ఏళ్ల వయస్సు వరకు పిల్లలు.. రోజూ 500 నుంచి 700 మిల్లీ లీటర్ల పాలు తాగాలి.
18 ఏళ్లు పైబడిన పెద్దలు అయితే.. రోజుకు ఒక నుంచి 2 గ్లాసుల పాలు తాగాలి.

ఆయా వయస్సుల వారు పైన చెప్పినట్లు పాలు తీసుకోవటం కొంచెం తక్కువ అయినా పర్వాలేదు కానీ.. ఎక్కువ తీసుకుంటే మాత్రం.. అతిగా పాలు తాగితే మాత్రం సైడ్ ఎఫెక్ట్ వస్తాయంట.. 

>>> ఎక్కువ పాలు తాగటం వల్ల చెడు, మంచి బ్యాక్టీరియాల మధ్య సమతుల్యత వచ్చి.. కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్, అతిసారం లేదా మలబద్దకం వంటి సమస్యలు వస్తాయంట. 
>>> అతిగా పాలు తాగటం వల్ల పాలలోని లాక్టోస్ వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది అంట. దీని వల్ల వాంతులు అవుతాయంట.
>>> పాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల ముఖంపై మొటిమలు, చర్మానికి సంబంధించి అలర్జీ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందంట.
>>>  పాలను ఎక్కువగా తాగటం వల్ల పాలలోని కొవ్వు వల్ల కాలేయం వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంట.. 

సో.. పాలు ఎంత మంచివో.. అంత చెడ్డవి అన్న విషయాన్ని మర్చిపోకూడదు.. ఏదైనా అతిగా తినటం, తాగటం అనేది ప్రమాదమే కదా.. సో పాలను కూడా లిమిట్ గా తీసుకుంటే ఆల్ హ్యాపీ...